Saturday, May 7, 2016

'మదర్స్ డే' అన్న దినోత్సవాలు ప్రారంభంగాకమునుపే
నాకు తెలిసిన ఓ మాతృమూర్తినిగూర్చిన పరిచయం చేస్తాను.
అప్పట్లో ఆంధ్ర ప్రభలో మాలతీ చందూర్గారి ప్రమదావనం ప్రతివారం వస్తున్న రోజులు.ఆమే తీరిగ్గా ఆ శీర్షికకు కార్డుముక్క రాసిపడేస్తే అది రెండు మూడు వారాలతర్వాత ప్రచురితమయేది. ఒక్కోసారి పొడి అక్షరాలతో ఇంకో సారి
పూర్తి పేరుతో ప్రశ్న అడిగినవారి పేర్లు ప్రచురితమయేవి.ఆరోజుల్లో
నెలకొకసారయినా తప్పక ఆమే పేరుతో ఓ ప్రశ్న--దానికి మాలతీ చందూరు గారి అమ్మూల్యమైన జవాబూ ప్రచురితమయేది.ఆమె ఎప్పుడూ తనకు సంబంధించిన ప్రశ్నలు అడిగినట్లనుపించేది కాదు.
తనచుట్టూ ఉన్నవారిని గురించిన సమస్యల పైనే ప్రశ్నలుండేవి.
ఇదంతా ఎందుకు చెప్పోచ్చానంటే కొన్ని అగ్ని పర్వతాలు అప్పటికే ఆమె
గుండేల్లో నివాసముంటూ అప్పుడప్పుడూ భయపెడుతూ వుండేవి.అయినా ఆమే మూర్తిమంతమయిన రూపంలో ఎక్కడా తన వ్యక్తిగతమైన బాధలను గూర్చిన విషాదం తొణికిసలాడేదికాదు.అంత నిబ్బరంగా ఉండగలగడం అందరికీ సాధ్యమవుతుందని నేననుకోను.ఆ స్థిత
ప్రజ్ఞత్వం కొందరికే పరిమితమేమోననిపించేది.మగపిల్లలిద్దరూ బాగా ఎక్కొచారు.తాము నమ్ముకున్న సిద్ధాంతాలకు కట్టుబడిపోయారు.అది తన విశ్వాసాలకు అతీతమైన వాళ్ళధోరణిని ఆమె ఎప్పుడూ అడ్డుపడిన దాఖలాకనబడలేదు.ఆడపిల్లలల్లో పెద్దవాళ్ళిద్దరికీ యోగ్యమైన ఉద్యోగాలు చేస్తున్న వారికే ఇచ్చి చేసారు.అలా రెండు దశాబ్దాలుతిరిగేసరికి రెండో అమ్మయి స్వర్గస్తురాలయింది.అలాకొన్నాళ్ళకుని అయిదో అమ్మాయి వర్ణాంతర వివాహంచేసుకుని దూరంగా వెళ్ళిపోయింది.ఒకమ్మాయి పూర్తిగా ఈప్రపంచంతో సంబంధ బాధవ్యాలు లేనట్తుగా తన మనోవైకల్య ప్రపంచంలో తాను ఉంటుండేది. ఒక్కోసారి యేం బాధ కలిగిదోఆ పిచ్చితల్లి అఘాయిత్యాలు చేసుకునేది.[కిరసనాయిలు పోసుకుని అంటించుకోబోయింది.ఇలా జీవితం ఒడుదుడుకుల మార్గంలోనే నడుస్తున్నరోజుల్లోనే పెద్దమ్మాయి భర్త అకాలమరణానికి గురయాడు.అప్పట్లో అంత నింపాదిగా వున్న మనిషి ఇప్పుడు భర్తృవిహీనకూడా అయి మగ పిల్లలదగ్గర తన శేషజీవితాన్ని వెళ్ళదీస్తూ వుంది.ఒక్క సారి వీలయితే ఆమెను కలుసుకును నాల్కో ఇన్ని ఆటుపోటులు ఎదురుకో గలిగిన ధైర్యాన్ని పరోక్షంగా అందించిన ఆమె వ్యక్తిత్వానికి పాదాభివందనం చేయగలిగితే ఎందరో మాతృమూర్తులకు ఆదర్శంగా నిలువగలిగినందుకు కృతజ్ఞతాపూర్వకంగా మనమేమివ్వగలం రెండు అశ్రువులను ఆమె పాదాలమీద అసంకల్పితంగా రాల్చగలగడం తప్ప.
ఇల్లాంటి ఎందరో మాతౄమూర్తులున్నారు.ఈభూదేవంత సజనంతో తమ జీవితాలను వెళ్ళదీస్తూ .వారందరినీ ఈ వదన గ్రంధం ద్వారా స్మరించుకో గలగడమే మనకు పుణ్యమని గుర్తెరగాలి.
==========================================================================
ఒక్కోసారి సొంత అమ్మలు జీవిoచిలేనివారిని గురించి దీర్ఘంగా ఆలోచిస్తే,ప్రేమాభిమానాలను
పంచడానికి స్వంత పిల్లలేకానక్కర్లేదని చెప్పగలిగిన వ్యక్తుల్లో మా మహలక్షమ్మ ఆమ్మ [మా పెదనాన్నగారి భార్య] మొదటివరుసలోకొచ్చి కూర్చుంటుంది.తన మరది పిల్లలమైన మమ్ములలను
కడుపులో పెట్టి చూసుకునేది అని చెప్పడంలో సందేహమేమీ లేదు. ఇప్పటిలా గ్యాస్ స్టౌవ్లూ లేవు
కుక్కర్ల ఊసూ తెలియదు.మాఊహకు తెలిసిందల్లా పొట్టుపొయ్యిలూ, కట్టెలపొయ్యిలూ. బొగ్గులకుంపట్లు కూడా ఇంకా ప్రచారంలోకి రాని రోజులు. వండనలయదు వేవురు వచ్చెనేని అన్నరీతిగా రోజూ
అయిదారుగురు తక్కువకాకుండా [ఇంత్ళో పిల్లలతోసహా ఉన్న పదిమందీకాక] ఉంటుండేవారు.
కర్ణం గారిల్లు కదా యే అదికారిఒచ్చినా, కులంతో పరిమితంగాకుండా భోజనానికి యేర్పాట్లు జరిగేవి. ఇదిగాక నాలుగు బర్రెల పాడి ఎప్పుడూ రెండు పాడిగానూ రెండు సూడిగానూ ఉంటుండేవి.ఆవులూ ఉండేవి వాటిని మేపుతామని తీసుకెళ్ళిన వాళ్ళు కొండమీద దొర్లిపడ్డాయని చెప్పి అమ్ముకునేవారు, అ 0 దుకని వాటినిపోషించే వసతిలేక అమ్మేసారు. ఇది గాక పొలంపనులు ఉన్నరోజుల్లో ఒకల్లో ఇఫ్ద్దరికో చద్దిమూఅలాగా అన్నం పంపాల్సి వుండేది. మాపెదనాన్నగారు పోయాక [1985 లో]
ఆవిడ మాదగారకొచ్చి గుంటూరులోనే వుండేది. మహ్యాహ్నం రెండుగంటలకు అందరూ తిన్నరనుకున్నాక ఆమె ఎంగిలిపడేది. పూజాపునస్కారాలూ మెండు.ఒంటిగంటదాకా పూజలు చేసుకునేది.
సాయంత్రం ఇరుగుపొరుగూ అమ్మలకాలను కూడదీసుకుని, భారత రామాయణాలు చదివి వినిపించేది.
చదువుకున్నది తక్కువేనయినా సంస్కారం ఎక్కువనిపించేది నాకు ఆమెను చూసినప్పుడల్లా!
ఆవిడచెప్పిన జీవన సూత్రాలు మా ఆవిడకు మంత్రాల్లా పనిజేసి అందరికీ తలలో నాలుకలాగా
ఉండగలిగేందుకు బాగా సాయపడ్డాయి, కన్నవారింటికష్టసుఖాలు కడుపులో దాచుకోవాలి, మెట్టినింటివారి ఇంటివిషయాలు మెదడు దాటిరాకుండా జాగ్రత్త పడాలి.ఇరుగు పొరుగుతో ఎప్పుడూ పొరపాటునగూడా మన ఇంటివిషయాలు పొక్కకూడదు.ముగ్గురుకోడళ్ళలో ఒకరి సంగతి ఇంకొకరితో


చెప్పడం ఆమే నైజానికి విరుద్ధమని తెలుసు.మమ్మల్ను మరిది పిల్లలని ఎప్పుడూ పిలిచేదికాదు, ఇతరులతో అలా అనేదీకాదు.నాపిల్లలే అన్నట్లు మాట్లాడేది. ఆమె మజ్జిగ చిలికుతుంటే అది రొజూ ఓ గంటకార్యక్రమం చుట్టూ చేరితే వెన్నను ముద్దలుగాజేసి పెట్టేది వేది అన్నం మీద మీగడవేసి తినండిరా పెద్ద చదువులకు వెళిటే బలముండాలిగదా! అనేది. ఆమే తమ్ముడు బావ మరది.పెద్ద చదువులు చదివి ఉ UNESCO లో ఉద్యోగం చేస్తుండేవాడు.రాయబారిగా ఇండియాకు వస్తాడనుకున్న సమయంలో కాలధర్మం చెందాడు. నందిరాజు వాళ్ళు. డిల్లీ స్కూల్ ఒఫ్ ఎకనమిక్స్ లో 50 వదశకంలో యెమ్మే చేసాడు, అటువంటి మాతృ మూర్తులను ఈ రోజుల్లో తలుచుకోగలగడం విశేషంకదా!
========================================================

Monday, May 2, 2016

పిల్లలూ దేవుడూ చల్లనివారేనని మనమనుకుంటున్నా కొందరు మనుషుల్లో దేవుడున్నాడనెది .కొన్ని యదార్ధ సంఘటనల ద్వారా నిరూపితమైనప్పుదు వాటిని కొట్టిపారేయలేం. ముఖ్యంగా ఒక వ్యక్తి జీవితంలోమలుపుత్రిప్పే సంఘటన జరిగి తలలు బద్దలు గొట్టుకునే సమయంలో ముక్కూ మొహం తెలియని వ్యక్తి ఒక్క మాట సాయంతో ఆసంఘటనకు విరుగుడుమంత్రం వేసి అమృతోపమంగా తీర్చి దిద్దగలిగినప్పుడు ఆవ్యక్తి దేవుడుతో సమనమనో ఒక ఆకు ఎక్కువెననో మనం అనుకుంటే తప్పేమీ లెదని నా అభిప్రాయం. ఈ సంఘటనను చదివాక మీరేమంతారో చూద్దాం. అది 1961-62 విద్యా సంవత్సరం. ఆయేడే యెస్సెల్సీ విద్యార్ధులకు హాల్ టికట్ విధానం మొదలయింది.ఆ హాల్ టికట్ స్కూల్నుంచి తీసుకున్న విద్యార్ధి అతిజాగ్రత పాటించాలని భావించి అది ప్యాంట్జెబులొ
హాల్ టికట్ పెట్టి మర్చిపోతే-- అదే జరిగింది.ఎవరివిషయంలోనో కాదు,నా విషయంలోనే.ఇక మా నాన్న హడావిడి అంతా ఇంతాగాదు ఇల్లంతా తూర్పారబట్తాడు. మెట్టు మీద వరి బస్తాలన్నీ దింపించి మరీ చూశా డు[ఎందుకంటే మన ఆటస్థలం అదేగనుక. ఇక అటక నంతటినీ జల్లించాఇక పోయిందని తైసాక ఒక్క మాటా పల్లెత్తు గా నన్ను అనకుండా వాడిమొహం వాడికెం తెలుస్తుండి అని సమ్రర్ధించగలగడం ఆయన ఆదరాభిమానాలకు నిదర్శనం. ఇక యేం చెయాలి.HM గారు గద్దల జాకబ్ గారు. వాళ్లమ్మాయి శాంతకుమారి[అనిగుర్తు] నా సహాధ్యాయి.ఇద్దరూ తెలిసిన వెంనే బయలుదేరి ఒచ్చారు.ఆ అమ్మాయి మాత్రం కన్నేఎళ్ల పర్యంతం అయింది. ఒక కులం కాదు ఒకే మతమూ కాదు.ఎందుకీ వల్లమాలిన అభిమానం.అప్పకింకా పిచ్చి సినిమాలూ ,వెర్రి సీరియల్సూ ఏమీ మనుషులనూ మనసులనూ కలుషితం చేయనిరోజులు. ఒక్క దీయీవూ గారివల్లనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇదీ సమాచారం.ఎలా?అప్పట్లో దీయీవో గారిని కలవడం అంత తెలికయిన విషయమూ గాదు.మా బావగారు తాడికొంద స్కూల్లో సైన్సు టీచర్. ఆయనకు తెలిసిన ఆచార్యులు[పూర్తి పేరు ఎంత తన్నుకున్నా ఇప్పటికిప్పుడు గుర్తు రావడంలెదు.] గెజటెద్ ఇన్స్పెచ్టర్ ఆఫ్ స్కూల్సు. ఆయన్ను కలిసాం. నేను యెమీ ఇప్పటికిప్పుడు చెప్పలెను. డీయీవో గారితో మాటాడి చెప్తానన్నారు.మల్లీ ఉత్కంఠే .నాకు యేదో తెలియని ద్ఘైర్యం. పరీక్ష రాయగలిగితే నా సత్త నిరూపించగలనని మొండి ధైర్యం.ఆయన నన్నొక్కడినే గదిలోకి పిలిచి నాలుగయిడు ప్రశ్నలడిగారు. సిలబస్ లోనె ననుకొండి. తర్వాత దూప్లికేట్ హాల్తిక్కట్ ఇవ్వడమె గాకుండా ఆ స్కూల్ సెంటర్ సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేసి మరీ చెప్పఘలగడం వారి సుహృద్భావం, సౌజన్య శీలం. పరీక్షలు బాగానే రాసాను. మార్కులెన్నొస్తాయని నాన్న అడిగితే మొదటి తరగతికి తగ్గకుండా వస్తాయని చెప్పాను. ఆచార్యులు గారు చెప్పారురా నీ స్కూల్ first స్తావని చూద్దాం. ఆజనేయ దయా మన ప్రాప్తం.అన్నారు. పరీక్షలయాక పూర్తికాలం ఆటలకో పంచాయతీ లిబ్రరీలోనూ ప్రయివెట్ దాంట్లోనొ పుస్తకాలు నమలడం. ఆరోకు పీర్ల సావిడి ముందు ఖాలీ స్థలంల్లో బచాలాట [ఓకులాట అనికూడా అనే వారు] ఆడుతున్నాం.భాస్కర రెడ్ది సాయంత్రం ఆరింటికి రైల్ దిగి ఒవ్చ్చి ఒఋఏయ్ అబాయిల్యూ మీరెసుల్ట్స్ ఒచాయిరా రండి మీ నంసర్లు చెప్పండి అంటీ చెప్పాం. ఆ
క్షణంలో గుండె దడ దడా కొకొట్టి కోవడం ఓ కొసమెరుపు.ప్యాసయ్యాను ఒకరొ ఇద్దరో తప్ప అందరూ ప్యాసయ్యాం.పదిరొజుల తర్వాత మార్కుల లిస్టు. అందరూ ఊహించిన దానికన్నా భిఉన్నంగా క్లాసు first ఒచ్చింది. ఇక కంటనిండా కనీళ్లు. ఆంజనేయులు స్వామికీ, దేవుడులాంటి ఆచార్యులు వారికీ మనసులో నమస్కారాలు పె ట్టి కుని ఆచార్యులు గారిని పండ్లు కొన్ని ఇచ్చాం ససే మిరా ఒద్దన్నారు.బలవంత పెడితె తీసుకున్నారు------
=============================================================================

Saturday, April 30, 2016

ఆయనపేరు వీరారెడ్డి.స్వతహాగా ఏమీ చదువుకోలేదు.తన సంతానాన్నయినా చదివించి తృప్తిపడదామనుకుంటే నిస్సంతు.అలాగని మొహం ముడుచుకు కూర్చోలేదు.
ఉన్నతపాఠశాలలో ఒక గది కట్టాలంటే పాతికవేలవుతుంది.[1950-55] లనాటి పరిస్థితి.ఆడబ్బు తనే సమకూరుస్తానన్నాడు.ఆ గదికి ఆయన పేరు పెడతామంటే పేరుకోసంకాదు యేటా పదిమంది పిల్లలకు ఆగది ఆశ్రమయితే అదేచాలునన్నాడు.కానీ ప్రభుత్వం ఆయన పేరు పెట్టి తమవంతు కృతజ్ఞతతెలియజేసారు.ఓ బీద కుర్రాడిని మెడిసిన్ లో గుంటూరు వైద్య కళాశాలలో చేర్పించి అతని చదువూ నిరాటంకంగా సాయ పడ్డాదు. ఆకుర్రాడుగూడా 'మా నాన్న'నే పిలుచుకునే వాడు ఊళ్ళొనే పిల్లనిప్పించి సాయపడ్డా డు .ఎ చే బొ ము [ఎడమచేతి బొటనవేలి ముద్ర]అయినా ఎందరికో విద్యాగంధం పూసి తన జీవితాన్ని సార్ధకం చేసుకున్నాడు.
డబ్బులిస్తామని కాలేజీకి పేరు పెట్టించుకుని దబ్బులివ్వని మహా వదాన్యులు వున్న మన రాష్ట్రంలో ఇది అమూల్యమైన అత్యంత ఆదర్శప్రాయమైన కార్యమే కాదనగలమా. ఆవిద్యార్ధి కంటి వైద్య నిపుణునిగా పేరు బడసినారని చెప్పడానికి సంతోషపడుతున్నాను.ఇదీ మావూరు లోనిఓ వదాన్యుడికధ
============================================

Friday, April 29, 2016

మనిషిని బోలిన మనుషులుంటారా అంటే మాపోస్టుమ్యాన్ వెంకటేశ్వర్లుశివరావు  అనే తెలుగు సినిమాల్ల్లోనిపాత నటుడినీ ప్రక్క ప్రక్కగా నిలబెడితేఇద్దరుమిత్రుల్లో 'అక్కినేని నాగ్గాడును' సరిపోలేలా ఉంటారు.
అయితే విశేషం యేంటంటే మా 'పోలిశెట్టి అనబడే శివరావు, అందరికీ ఓ చిన్న "రాముల వారిదగ్గరుండే
హనుమంతుడులా'ప్రత్యక్షమై తన చేతనయినంత సాయం అందిస్తాడు.

మా చిన్నప్పుడు మా హైస్కూలు ముందు వాగుచిన్నపాటి వానకుకూడా ఒడ్డంటా ప్రవహించేది .అక్కడ ఈ శివరావు అనబడే ఆంజనేయుడు   [ తోకలేని]తయారయే వాడు.ఈ ఒడ్డునుంచి ఆ వొడ్డుకుపేద్ద మోకు ను లాగి అవతలైంకోమనిషిని పట్టుకోడానికి నిలబెట్టి అందరినీ అవతలి ఒడ్డుకుచేర్చే వాడు.మాకందరికీ స్కూలుకెళ్ళాలన్న ధ్యాస కన్నా ,నీళ్ళలో నడిచే అనుభూతి మమ్మల్ను కట్టి పడే సేది.అది ఆ శివరావుకి అందరిపైన ఉండే ప్రేమనే చెప్పుకోవాలి..సహకరించాలన్న ఆత్మీయత అతని తరగని ఆస్తులు,మా పోలిశెట్టికి ఓ మైకు సెట్టూ నాలుగు పె ట్రొ మాక్సు లైటులు  ఉండే వి.అన్ని శుభకార్యాలకూ &అద్దెకిచ్చి కొంత ఆదాయం పొందుతుండే వాడు.ఆమైకు సెట్టు కు అహుజా బాట్టరీ ఉండేది,నాలుగు గొట్టాలూ HMV రికార్డుల పెట్టే ఉండేది.ఓ పదేళ్ళు ఆ సరంజామా తో కాలక్షేపంచేసాక పోటీగా టేప్ రికార్దులసెట్టుతోమరొకడు అవతరించాక ఈ రికార్డుల భాగోతానికి క్రమేపీ తెరపడింది.
ఒక్కో సారి పెళ్ళిళ్ళ లో, బ్యాటరీ వీకయి పంతులుగారి గొంతు పీలగామారితే పురోహితూలవారిని ఆయన్ను ఓ గ్లాసుడుపాలు తాగమని
ఆ బ్యాటరీ పైన ఉండే ఆరు కానాల్లో సోడాలు గొట్టి పోసే వాడు,మళ్ళీ ఝామ్మని మైకు పాటలను బిగ్గరగొంతులో ఘనంగా అందుకునేది.
రికార్డులకంపెనీ వారు ఈ తిరిగే మట్టి రికార్డుల స్థానంలో క్రమేపీ టేపుల్లోకి దిగడ0తో ఈ వ్యవహారం మూత బడ్దా పెట్రో మాక్సులు కొన్న్నాళ్ళుబాగానే నడిచింది.ఈ లైట్లూ బాగా పాతబడి  మంగళసూత్రం కట్టే టైంకో,  తలంబ్రాల సమయానికో కొండెక్కుతామని మొరాయించి విసిగించేవి.
ఇక ఆ కార్యక్రమాలూ వెనుకంజ వేయడo మొదలెట్టాక బండి డాన్సు ల కాంట్రాక్టులు మొదలెట్టాడు.

బండి డాన్సులంటే అదేనండీ టైరు బండి బల్లపరుపు చక్కమీద వేదికగానిలిపి దానిపై యూరియా గొతాలు మందం గాను మెత్తగానుయూరియ గొతాలు మందంగాకప్పిదానిమీద అమ్మాయిలూ అబ్బయిలను ప్రక్క వూర్లనుండికొనితెచ్చి
 ఆడించే వారు.పల్లెల్లో అది ఓకాలక్షేపం అప్పట్లో.అదికొన్నాళ్ళు గడిచా  జనం ఆ బొడి[ ద్యాన్సు చేసే అమ్మాయికి
పేలొచ్చాయని వాళ్ళ అమ్మ్మా నాన్నా బోడిగుండు జేయిస్తే ఆ వచ్చి ఓ అయిదేళ్ళపాటు పేరు నిలబదిపోయిండి.
ఇక ఆతర్వాత అంతకన్నా కొత్త సినిమా పాటలతోనరసరావుపేట శివరాత్రి ప్రభలమీద రంగు రంగుల లైట్లతో
కళ కళగా ఒచ్చేక ఈ కళా పోలిసెట్తికి దూరమయింది.కొన్నాళ్ళు పోస్ట్ మ్యాన్లసంఘానికి గౌరవా ధ్యక్సుడిగా కూడా వెలగబెట్టి కొడుక్కు
 ఆశాఖలోనే ఉద్యో గం వచ్చాక ఆ పదవికీ దూరమై కొడుకు దగ్గర అత్తా కోడళ్ళ తగూలూ ధారావాహికంగా రావడం మొదలెట్టాక
దెభ్భయ్యో పడిలో ఆ ఉద్యోగానికి దూరమై పొన్నె కల్లులో ఉండడం ప్రారంభించాడు.
మేము స్కూల్లోచదివేవ్రోజుల్లో సైకిలుతొక్కడం నేర్చుకోవడం ఓ బ్రహ్మ విద్య అనుకుకునేవాళ్ళం.ఎస్సెల్సీకొచ్చినా
 సైకిలి తొక్కడం రాదంటే అవమానమని దొంగ చాటుగా సైకిల్ నేర్చుకోడానికి మా శివరావే ఆధారం.
శివరావు దగ్గర నాలుగుపెద్ద సైకిళూ న్రెండు చిన్న సైకిలుండేంది.కాళ్ళందాలంటే బండరాయి సాయంలేకుండా
చిన్న సైకిలే వాటంగా అందుబాటులొ వుండే ది.శివరావు లేనప్పుడు [అంటే పోస్ట్ బ్యాగులు తీసుకురావడానికి కొన్నాళ్ళు పొన్నెకల్లు
 కొన్నాళ్ళు సిరిపురం 10 గంటలకల్లా బయలుదేరివెళ్ళేవా డు.  మళ్ళీ అన్ని పనులూ ముగించుకుని వచ్చేసరికి
 నాలుగున్నర . అయిదో అయేది.ఈలోపు స్కూలునుంచి రాగానే వాళ్ళ నాన్ననో [రామస్వామి] లేదా తమ్ముడు వెంకటస్వామినో
 అడిగి తీసుకుని ఓ గంటతొక్కుకుని మోకాలి మోచ్చిప్పలు పగలగొట్తుకుని వచ్చే వాళ్లం .అలా వాళ్ళ నాన్న బాగా పె ద్దవాడవడం     మూలాన   తమ్ముడు తాగుడు  కలవాటు పడి డబ్బులెక్కల్లో తేడాలు రావడంతో ఆ వ్యాపారానికి మంగళం పాడాడు.

మా హనుమంతుడికి మొక్కలుపెంచడమ్మీద మహాశ్రద్ధ.మా రెండో అ బ్బాయి పెళ్ళికొచ్చినప్పుడు మాఇంటి తోటను జూసి గుండెలు బాదుకుని ఇల్లానా తోటను పెంచేదీంటూ గొప్పులుదీసి మొక్కలు నాటి[ఉన్నవే ఎండిన ఆకులనురాల్చి కొమ్మలను కత్తిరించి బాగపోషణజేసి మళ్ళీ పది పదిహేనురోజుల్లో ఎరువుతో వచ్చి వేసి ఎలా ంక్కలనెలా పెంచాలో చప్తాను అంటూ, మళ్ళీ తనొచ్చేటప్పుడు ఓ మల్లె మొక్కనూ, గోరింటమొక్కనూ తెచ్చినాటి వాటికి సంతుష్టిగా గొర్రె పెంటనుదెచ్చి ఎరువుగా ఏసి నీళ్ళు పెట్టి మళ్ళీ పదిరోజులకొచ్చి మొక్కలు కాస్త నిలదొక్కుకోవడంచూసి తృప్తిపడి వెళ్ళాడు,ఆతవాతమళ్ళీ ఓ నెలకొచ్చి అక్కదక్కడాపెరిగిన గడ్దిని,కలుపుమొక్కలనూ పీకి,గోరింట కొమ్మలు విరువకండా ఆకులుమాత్రంకోస్తూ కాసిని నీళ్ళు అప్పుడప్పుడూ చిలకరిస్తే బాగా అల్లుకుపోయిపెరుగుతుందనీ చెప్పి ఏందుకు ఇంతహ్=గా శ్రమకోర్చి త్చ్చావు వెంకన్నా అంటే నాది శ్రమేముందబ్బాయ్ బస్సువాడే గదామోసేది,మనం టిక్కట్ కొనికూర్చు0టే వాడే మోసుకొచ్చడని తొర్రిపళ్ళలోంచి నవ్వి అమ్మాయికి[మా ఆవిడకి] మల్లెపూలూ,గోరింటా కూ ఇష్టమని మా ఆవిడ ఇచ్చి పంపింది
నేను తే చ్చి నాటాను అంతే అని నవ్వే వాడు

ఆమల్లె చెట్టు రెండురోజుల్లో రెండువందలు పైగా ముద్ద గా  పూలనుపూస్తే ఆవిడానందంగా     లక్ష్మి అమ్మవారికీ లలితమ్మ వారికీ అష్టోత్తర    శతనామ పూజలను దీక్షగాజేసి కుదుటబడింది.ఈమల్లెలెంత ఘుమలాడుతున్నాయో చూడండి అని తను అంటే రావెల వారిసంస్థానమంటే ఉన్నగొప్ప అల్లాగే ఘనంగా ఉంటాయిఏదయినా అని ఓ మా టి వదిలి నవ్వుకుకున్నాను ముసి ముసిగా.

మానాన్న[గారు] పోయినప్పుడు అతన్ని దు ఖాన్ని ఎవరూ ఆపలేకపోయాం.పెద్ద పంతులుగారు[పెద్దనాన్న]మంచానబడి దాటిపోయారు,
ఈయనకేంతొందరొచ్చిందని తిరుగుతూ తిరుగుతూ ఉన్న మనిషి ఇలా పోతే నాకు మంచీ చెడు చెప్పేదెవరు? అని పెద్దగా శోకండాలు
పెడుతుంటే వచ్చి  న  వాళ్ళందరికీ "వీడురానిజమైన బంటంటే "అని నోరు నొక్కుకున్నారు.

మళ్ళీ నెలరోజుల్లో ఒస్తానని వెళ్ళాడు. సంక్రంతికొచ్చాడూగదా అని అతనికి కొత్త ధోవతీ,పైపంచా
 పెడితే తీసుకోనంటే తీసుకోనని గొడవ.ఆవిడేంఓ వాళ్ళావిడకని ఓ కొత్తచీరా జాకెట్ ఇచ్చి పంపింది అతనితో. ఎంతో మురిసిపోయాడ
 మళ్ళే ఆవిడత్ఫో వస్తానని వెళ్ళీనవాడు అందరినే ఇక్కడె వదిలి ఒక్కడూ ఒంటరిగా వాళ్ళ పంతులుగార్ల దగ్గరకు వెళ్ళాడూ
.అక్కడ వాళ్ళమ్మాయి గారు కలిస్తే ఈ పూలమొక్కలన్నీ వదిలి మా అబ్బాయిని ఒ0రిగాడిని చేసీ ఎలా చ్చావమ్మా అని అడిగే వుంటాడు ఆ దివ్యధామంలో.
-----------------------------------------------------------------------------------------------------------------------------

తా.క : అతన్ని  గూర్చి ఓ మాట చెప్పడం మరిచాను.
అతను మట్టిమిద్దె ఇంట్లోనుంచి నేతమగ్గాన్ని వదిలి పూరిగుడిసెలో అద్దెకు మారడమతని నీతికీ నిజాయితీకి నిదర్శనగా చెప్పుకోవచ్చు.ఒక సిద్ధాంతానికి కట్టుబడి పనిజేస్తే చివరకు మిగిలేది శుద్ధ పేదరికమేనని గ్రహించిన జ్ఞాని అతడు.

-----------------------------------------------------------------------------------------

Monday, April 4, 2016

మంచి ఉపాధ్యాయుడంటే బీయేలూ ఎమ్మెలు చదవడమో, బీ ఈడినో ఎం ఈడీ డిగ్రీలు పేరు వెనుక తగిలించుకోవడమో కానే కాదని రుజువు చేసిన వాళ్ళు,నాలుగయిదు డశాబ్దాలక్రితం అసంఖ్యాకంగా దొరుకుతారనీ, వాళ్ళు వేసుకునే బట్టల ద్వారాకూడా ఆ గౌరవం
అధికస్య అధికం ఫలమన్న రీతిలో ఉండదనీ,జాతీయ స్థాయిలోనో
రాష్ట్ర స్థాయిలోనో ఉత్తమ ఉపాధ్యాయుడిగా పెరూ
బిరుదులోపురస్కారాలవేటో వారిని ప్రభావితం చెయ్యలేవని నేను గాఢంగా నమ్మ వలసిన అవసరం మావూళ్ళో కోమటి వీరయ్యగారిని చూసిన ఎవరికయినా ఇట్టే అర్ధమయిపోతుందని నా గట్టి నమ్మకం.వాళ్ళు ప్రభుత్వమిచ్చే దివ్యమైన జీతాలప్రభావం కానే కాదని ఇట్టే అందరికీ అవగరమౌతుంది,

ముతక ఖద్దరు బట్టలలో[ఇరవై నంబరనే వాళ్ళని గుర్తు.]
అప్పటికే కొంత తెల్లబడినమీసాలతో బాగా చిలికిన వెన్నా మీగడలందించిన దేహ పుష్టితో అలరారే మూర్తి విగ్రహం ఆయనది. ఉదయం ప్రారంభంలో సరస్వతీ నమస్తుభ్యంతో --- మొదలెట్టి మసక మసక చీకటి పడకముందే దీపంజ్యోతి పరబ్రహ్మం శ్లోకాన్ని

వల్లించమంటూ మాతో గొంతు కలిపే దాకా ఆయన చదువు చెప్పడంకొన సాగేది.మాకు ఇప్పటిలా బండెడుపుస్తకాలను మోసే అవసరమూ ఉండేదిగాదు.ఓమట్టి పలక[మార్కాపురం పలకలనే వారు] ఆరర్వాత కొంత కాలానికి రేకు పలకలు లొతలొటలాడుతూ వచ్చాయి. ఆపెద్ద పలకలోనే అన్ని సబ్జెక్ట్ల సారం రంగరించ బడి ఉండేవి.అప్పట్లో ఆయన ఎక్కాలు చెప్పడం అప్పగించుకుమే తీరు చాలా భిన్నంగా
వుండేది.పిల్లలమే ఒకరికొకరం ఎదురెదురుగా నిలబడి

అప్పజెప్పుకుంటూఉంటే దీక్షతో ఆయన బహు ఏకాగ్రతతో గమనించే వారు.తప్పు చెప్పామా చింత [సగం పచ్చిది] బరికెతో సన్మానం
మొదలయెది. అన్న సూత్రం ఆయనకు పూర్తిగా తెలిసో లేదా తెలిసినా ఆ సిద్ధాంతంతో ఆయన యేకీభవించడం అప్పటి చదువుకో వాలన్న తపన అయ్యుడొచ్చునేమో గూడా.రెండు పాములనుబోలిన తోలు బెత్తాలతోనందయ్య,,మందయ్య] సత్కార భయమో మమ్మల్ను తప్పులు వల్లించే

తీరాన్నుంచి దూరంగా జరిపేవి.ఆయన పారితోషికం నెలకు పది రూపాయలలోపే ఉండేది.కారణం ఆయన జీవనో పాధి శేద్యం.ఈ చదువుచెప్పడం ఆయన గారి ప్రవృత్తి. పిల్లలు గూడా రూపాయో అర్ధో నెల నెల చదివించుకునే వారు. ఇక శతకాలంటారా ఆయననోట శుద్ధంగా పలకబడదానికి సిద్ధమయేవి.రోజుకో పద్యమే చెప్పే వారు. అక్కడే నాలుగు సార్లు ప్రతివిద్యార్ధీ వల్లించే వారు.అందుకే దాశరధీ,భాస్కర,నరసిమ్హ శతకాలు తరగతుల వారీగా ఉండేవి. చిన్న తరగతుల్లోవెమన సుమతీ శతకాలు,కృష్ణ,కుమారీ [మగపిల్లలకు] కుమారీ శతకం చెప్పే వారు.యే పుస్తకాన్నీ చేతబట్టిన గుర్తూ లేదు.అలా మాకు పట్తుబడి ఇప్పత్లో నాలుకపై ఆడే పద్యాల ప్రాభవం ఆయన పెట్తిన భిక్షేనని ఒప్పుకుని గొప్పగా చెప్పుకోక తప్పదు.నాలుగోతరగతికొచ్చేసరికి పెద్ద బాలశిక్ష మాకు కరగ్రహణమై కళ కళ లాడేది.]సశేషం]

Wednesday, March 30, 2016

లేవుగనుక ఎడ్లబండిగట్టుకుని వెళ్ళే వాళ్ళం.నాతోపాటు ఇప్పుడు డాక్టరయిన మధుసూదనుడు తొడయే వాడు.బండి జల్లలోనో ముందు తొట్టిలోనో దుప్పటికప్పుకుని దాక్కునే వాళ్లం. బండి కొంతదూరం వెళ్ళాక మమ్మల్నుగమనించినా ఇంకచేసేదేంలేదుగనుక ఊరుకునే వాళ్లు పోనీలెమ్మని.ముఖ్యంగా మాకు సత్య హరిశ్చంద్ర నాటకమంటే
చచ్చేంత అభిమానం. అందులోముఖ్యంగా కొన్నిపద్యాలు మమ్మల్ను బాగా ఆకర్షించేవి మొదటగా తిరమై సంపదలెల్ల రెండోది
మాయామేయజగంబు--మూడోది, దళమౌ పయ్యెదలోనడంగియును-- ఇవిగాక కాటిసీనులోని జాషువా గారి పద్యాలు బాగా కదిలించేవి.
ముఖ్యంగా నక్షత్రకుడిగా పులిపాటి వెంకటేశ్వర్లు గారు,తమ్ముడు [లక్ష్మీ నారాయణని గుర్తు] వేస్తుంటే విశ్వామిత్రునిగా మందపాటి రామలింగేశ్వరరావుగారు అద్భుతమైన వాచకంతో అలపించేచేవారు.

ఆసమయంలోనే 'శివశ్రీ'యని ఓ కొత్తనటుడు హరిశ్చంద్రుని వేషంవేసేవాడు.అతనిది తణుకో బందరో బాగా గుర్తులేదు.

ఆ' కింకరుడే రాజగు రాజె కింకరుడగున్ --'అన్న మాటలను నాటకంలో
పదే పదే సందర్భానుసరంగా పదే పదే అనడం బాగా నప్పింది.

మా పెదనాన్న గారికి ఈ నాటకాలంటే ఎక్కువ ఇష్టం.స్వయంగా పాదుకా పట్టాభిషేకమనే నాటకమ్రాసి ఊరిలోని వాళ్ళతో ఆనాటకాన్ని పలు చోట్ల ప్రదర్శించి ప్రశంసలనందుకున్న ఘనుడాయన. ఈ నాటకంలో దశరధుడివేషం వేసి జనంచేత కన్నేఏళ్ళను పెట్తించేవారని చెప్పుకునే వారు ఆయన్నుగురించి.
============================================================

Wednesday, March 23, 2016

కొన్నిపేర్లు వినడానికే విచిత్రంగా ఉన్నట్లనిపించినా
వారి స్ఫూర్తిమంతమైన జీవితం-- మార్గదర్శకంగా నిలుస్తుంది.
అటువంటివారిలో చెప్పుకోదగిన వ్యక్తి ధన్ గారు--
గుంటూరును ఒక విద్యానగరంగా తీర్చిదిద్దిన ఘనత ఆయనదే--
క్రమ శిక్షణ  కు మారుపేరుగా వుండే వారు-- విద్యార్ధులపట్ల సిమ్హస్వప్నంగా వుండే వారు--ఆయన దగ్గర శిక్షణ  తీసుకున్న ఎంతో మంది పేరుగడించిన వైద్యులుగా ఇంజనీర్లుగా ఉపాధ్యాయులుగా
దేశమంతటా విస్తరించి వుండడం ఆయనకున్న కీర్తికిరీటంలోఅది కోహినూరు వజ్రమే--
సాహిత్యంపట్ల లలిత కళలపట్ల మక్కువ.
అంతశెముషీఖని దగ్గర పనిచే  సినవారు,ఎందరో విద్యానిలయాలను ఏర్పరచుకుని ఖ్యాతినందిన దాఖలాలు ఎన్నెన్నో--అసంఖ్యాకం--

ఒకప్పుడు రవి కళాశాల గుంటూరు పట్టణంలో ఓ కొండగుర్తుగావుండేది. ప్రవేశపరీక్షలకు .దేశ విదేశాలనుండి
ఇక్కడకు వచ్చి శిక్షణ తీసుకోవడం ఆయన ప్రతిభకు తార్కాణం..

అప్పట్లో దేశంలో పేరున్న ప్రొఫెసర్లను ప్రఖ్యాత విశ్వ విద్యాలయాలనుండి తెప్పించి విద్యార్ధులకు  శిక్షణనిప్పించేవారు
గుంటూరు మణిహారంలో కోహినూర్ వజ్రంగా మనం శ్లాఘించదగిన
చెన్నావఝల విశ్వనాధంగారే ఆ మహితాత్ముడైన సి.వి.యన్ ధన్..

Thursday, March 17, 2016

ప్రజల వద్దకు పాలన పేరుతో గతంలో ఇప్పుడు ఏలికలే
అందరినీ భయభ్రాంతులకు గురిచేసి జవనాశ్వంపై దౌడు తీస్తున్నరోజులు.
అందునా ఆయనేమో-- రైతు బాంధవుడు.. ఢిల్లీలో సభ్యత్వం వున్న పెద్ద మనిషి..

నేనా ఒక శాఖకు నిర్వహణాధికారిని రోజూ పగలనకా రాత్రనకా ఫోన్లో సతాయించేవాడు--- తీరా ఆ రుణం దేనికంటే గ్రామోదయ పధకంక్రింద నిరుద్యోగ
యువకుడికి అక్షరాలా 3 లక్షల లోనుకోసం.. వ్యాపారం వుల్లిపాయలు--
అప్పట్లో కిలో రెండు రూపాయలు--అంత సొమ్ముపెట్టి కొన అవన్నీ ఎక్కడ దాచాలి?
ఇవన్నీ ఆలోచిస్తే అది నిలబడే వ్యాపారంకాదని అర్ధమయింది.. మాదగ్గరే
ఖాతావున్న హోల్ల్సేల్ వ్యాపారినడిగాను-- చాలా కష్టంసార్--సరుకు తొందరగా ఈసారెందుకు కుళ్ళిపోతున్నది మేమే తగ్గించి రోజుకు 10-15  వేలు మించి తెప్పించడంలేదు అన్నాడు--సరే మళ్ళీ పెద్దదొరగారిఫోను-- సరే తేల్చి చెప్పక తప్పిందికాదు--ఒక పాతికవేలు మించి ఈ లోను ఇవ్వడంకుదరదు అని..ఇక దొరగారు అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు--మరి మీవాళ్ళు హర్షద్ మెహతాకు అంత ఎట్లా ఇచ్చారు అన్నాడు? సారీ సార్ ఆలోను నేనివ్వలేదు ఎవరు ఎట్లా ఇచ్చారో నాకెరుకలేదు--కానీ మీరు 2 సంవత్సరాలక్రితం మీ పార్టీవ్యక్తికి ఈ శాఖ ద్వారా 50 వేలు ఇప్పించారు--
సిమెంట్  కొట్టుకని కొట్టూలేదు డబ్బు కట్టడంలేదు--ఇప్పుడేమో ప్రభుత్వం క్రిమినల్ కేసు పెట్టమంటున్నది,ఆదరఖాస్తుకు మీ రికమండేషన్ లెటర్ జతచేసివుంది ఒకసారి మీతో చెప్పి రేపు క్రిమినల్ కేస్ ఫైల్ చేదామనుకుంటున్నాను,ఒక పదివేలయినారేపు కట్టించండి లేకపోతే మీపేరూ బయటకొచ్చేలావుంది అన్నాను.. అంతకుముందు ఆలోను విషయం లోక్ సభలో ప్రస్తావిస్తానని బెదిరించిన వ్యక్తి మరునాడు పొద్దున బ్యాంకు తలుపులు తీసేలోపు ఆ రుణగ్రహీత హాజరయేలా చేసి నానెత్తిన పాలుబోసాడు-అది సుతా మళ్ళీ నాకుఫోనొస్తే వొట్టు--

Tuesday, March 15, 2016

మాగుంటూరి గోంగూర లాంటి
రుచికరమైన గొప్పలు
[అవీ ఇవీ అన్నీ కలగాపులగంగా]
కాచుకోండి ఇక ధారా వాహికంగా
జీడిపాకాన్ని మరపించే
 అత్యద్భుత రచనా వ్యాసంగం
ముందస్తుగా  గోంగూరా దాని పుట్టు పూర్వోత్తరాలతో విందులను
కమ్మగా నోటికి అపథ్యంగా వినిపించి అలా గంతులేసుకుంటూ
ముందుకడుగులేస్తూ కబుర్లనూ [కాకర కాయలొద్దులేండి--చేదు--
గాధా సప్తశతిగా అల్లుకుపోతూ ,మధ్యమధ్యలో సాహిత్యాన్నీ
ఆనాటీ జీవనగమనాన్నీ నెమరువేసుకుంటూ ముందుకు సాగుదాం!
ఉపోద్ఘాతం ఇలా బంగాళా ఖాతంలా సాగితే ఎంఉంటుంది మజా[కా]
అనుకోమండి ఆలశించిన ఆశాభంగము--స్త్రీలకు ప్రత్యేకపు
స్థలములు గలవు త్వర పడండి--ఆలశించిన ఆశాభంగము మరువకండి. మీకు తెలిసిన గుంటూరును మెచ్చే సహృదయంగల అందరితోనూ ఈ రుచికరమూ ఆరోగ్యప్రదమూ ఐన మాటా మంతీని మనసారా పంచుకోండి. నువ్వేంది చెప్పేదీ గోంగూర అనుకోకండి.
కొపమొచ్చిన కొందరు[కారంతినే నోళ్ళుగదండీ అలానే అంటుంటారు
మా వాళ్ళు మన్నించండి,పండుమిరప్పళ్ళతో నూరిన నోరూరించే
గోంగూర పచ్చడి తిననంత వొట్టు-- [సశేషం]

Thursday, March 10, 2016

ఇక వరమ్మదగ్గరకెల్దాం

-------------------------------
మావూరిముందరతోపులో ఓ వీరాంజనేయస్వామి వారి  గుడివుంది
మావూరు వారంతా శనివారంవస్తే గుడికి వచ్చి ప్రదక్షిణలుజేసి
మనసారా భగవంతుడినిప్రార్ధించుకుని వెళ్ళే వాళ్ళు.
మనసుకు బాధకలిగినా మనసులో మనసులేకపోయినా
మావూరి   దాక్టర్గారి దగ్గరకెళితే మందులతో పాటు
ఆంజనేయస్వామికి 40 ప్రదక్షిణలు ఓ మండలంపాటు చేయమని సెలవిచ్చే వారు.
 వాళ్ళకు ఆ జబ్బు కుదిరి కుదుట పడేది.
అదంతా ఆ భగవంతుడి దయే నని అనుకునే వారు.అది తప్పని ఎవరూ
భేదాభిప్రాయం వ్యక్తం చేసే వారూ కాదు.ఇక అక్కడ యే శుభకార్యం ఇంట్లో జరిగినా అనుకున్నది జరిగినందుకు 5 కొబ్బరికాయలు కొట్టిమొక్కును తీర్చుకునే వారు. శనివారం నాడు
ఆకుపూజలు జరుగుతూ ఉండేవి. భజనలూ అవీ జరుగుతుండే వి.
తొలకరినాడు పొలంపనులు ఆయన దగ్గరనుంచే ప్రారంభమయేవి.

మూడేళ్ళకో నాలుగెళ్ళకో ఆంజనేయస్వామిని అందంగా అలంకరించే వారు రకరకాల రంగులతో డ్రాయింగ్   మాస్టారు  క్రిష్ణారావు. ఆతర్వాత చిన్నసైజు ప్రభలుగట్టి యాదవ యువకులు గులాము జల్లుకుంటూ కోదె గిత్తలను విగ్రహంచుట్టూ ప్రదక్షిణలు జేయించేవారు. ఈమధ్య వాళ్ళే రoగులు
స్వామివారి విగ్రహానికి  వేయడంకూడ కద్దు.
చాలా సంవర్సరాలపాటు పైకప్పుకూడాలేకుండానే వుండేది.[సుమారు 70 యెళ్ళనాడు,తుర్లపాడునుంచి మావూరికి తరలి వచారని మాత్రం తెలుసు.అక్కడ బావిలో విగ్రహం దొరికిందని అన్ని వూళ్ళ వాళ్ళూ
ఎడ్లబండ్లుగట్టుకుని వెల్లారట. మావూరివాళ్ళూ నలుగురితో నారాయణ అనుకోకుండా భిన్నంగా ఉపవాసముండి, భజన బృందంతో
ఆవూరికి వెళ్ళారట. ఎవ్వరు తీద్దామని ప్రయత్నించినా రాని విగ్రహం మావూరి వారి భజనల ప్రభావమో భక్తి తత్పరతలకు మెచ్చో ముఖ్యంగా పెద్ద డాక్టర్ సుబ్బారావుగారూ, మదీయ తండ్రిసుబ్బారావూగారల కృషీ చిన్న డాక్టర్ కృష్ణమూర్తిగారి కృస్సంకల్ప బలం వుందని వూరంతా గొప్పగా చెప్పుకోవడం మాత్రం విన్నము.
ఇక అసలు విషయానికొస్తే ఈ వరమ్మా ఆ అంజనేయ స్వామికి అనుంగు భక్తుతాలు. శనివారం నాడు ఆ స్వామివారు ఆమే వొంటిమీదకొవ్చ్చే
వారు.అది ఆమె భక్తి కావొచ్చు అధునాతన సాంకేతిక విజ్ఞానం వల్ల మానసిక రుగ్మతా కావొచ్చు. ఆరోజుల్లో మాత్రం అందరూ అది ఆమె ఒంటిమీదకు దేవుడు రావడం శుభ సూచకమేనని భావించే వారు. భవిష్య వాణిలా ఎమీ చెప్పిన దాఖలాల్లేవుగాని ఆ కొద్ది నిమిషాలూ[ఒ 15 నిమిషాలు] మన స్వరంతిలో ఉండేదికాదన్నది మాత్రం వాస్తవం. ఆ తర్వాత అరచేతిలో హారతికర్పూరంబిళ్లలువెలిగించుకునేది. అక్కడె వున్న వేపచెట్టు ఆకులు గుప్పెడు దాకా తింటుండెది. ఎవ్వర్రూ వరసతోపిలిస్తే మాత్రం విపరీతంగా కోప్పడేది. "ఎవరురా నీకు అత్త నేనిప్పుడు సిoహాద్రి వరమ్మను కాదురా వెధవా !!" అని కసురుకునేది. మాచిన్నపుడు ఈ సంఘటనలు అనేకం చూసాం గనుక కించిత్తు భయంతో అసంకల్పితంగా వణుకు పుట్టడం గూడా జరిగేది.

=======================================================