ప్రజల వద్దకు పాలన పేరుతో గతంలో ఇప్పుడు ఏలికలే
అందరినీ భయభ్రాంతులకు గురిచేసి జవనాశ్వంపై దౌడు తీస్తున్నరోజులు.
అందునా ఆయనేమో-- రైతు బాంధవుడు.. ఢిల్లీలో సభ్యత్వం వున్న పెద్ద మనిషి..
నేనా ఒక శాఖకు నిర్వహణాధికారిని రోజూ పగలనకా రాత్రనకా ఫోన్లో సతాయించేవాడు--- తీరా ఆ రుణం దేనికంటే గ్రామోదయ పధకంక్రింద నిరుద్యోగ
యువకుడికి అక్షరాలా 3 లక్షల లోనుకోసం.. వ్యాపారం వుల్లిపాయలు--
అప్పట్లో కిలో రెండు రూపాయలు--అంత సొమ్ముపెట్టి కొన అవన్నీ ఎక్కడ దాచాలి?
ఇవన్నీ ఆలోచిస్తే అది నిలబడే వ్యాపారంకాదని అర్ధమయింది.. మాదగ్గరే
ఖాతావున్న హోల్ల్సేల్ వ్యాపారినడిగాను-- చాలా కష్టంసార్--సరుకు తొందరగా ఈసారెందుకు కుళ్ళిపోతున్నది మేమే తగ్గించి రోజుకు 10-15 వేలు మించి తెప్పించడంలేదు అన్నాడు--సరే మళ్ళీ పెద్దదొరగారిఫోను-- సరే తేల్చి చెప్పక తప్పిందికాదు--ఒక పాతికవేలు మించి ఈ లోను ఇవ్వడంకుదరదు అని..ఇక దొరగారు అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు--మరి మీవాళ్ళు హర్షద్ మెహతాకు అంత ఎట్లా ఇచ్చారు అన్నాడు? సారీ సార్ ఆలోను నేనివ్వలేదు ఎవరు ఎట్లా ఇచ్చారో నాకెరుకలేదు--కానీ మీరు 2 సంవత్సరాలక్రితం మీ పార్టీవ్యక్తికి ఈ శాఖ ద్వారా 50 వేలు ఇప్పించారు--
సిమెంట్ కొట్టుకని కొట్టూలేదు డబ్బు కట్టడంలేదు--ఇప్పుడేమో ప్రభుత్వం క్రిమినల్ కేసు పెట్టమంటున్నది,ఆదరఖాస్తుకు మీ రికమండేషన్ లెటర్ జతచేసివుంది ఒకసారి మీతో చెప్పి రేపు క్రిమినల్ కేస్ ఫైల్ చేదామనుకుంటున్నాను,ఒక పదివేలయినారేపు కట్టించండి లేకపోతే మీపేరూ బయటకొచ్చేలావుంది అన్నాను.. అంతకుముందు ఆలోను విషయం లోక్ సభలో ప్రస్తావిస్తానని బెదిరించిన వ్యక్తి మరునాడు పొద్దున బ్యాంకు తలుపులు తీసేలోపు ఆ రుణగ్రహీత హాజరయేలా చేసి నానెత్తిన పాలుబోసాడు-అది సుతా మళ్ళీ నాకుఫోనొస్తే వొట్టు--

No comments:
Post a Comment